Chiranjeevi: జెంటిల్మన్ లుక్ లో చిరంజీవి... ఆకట్టుకుంటున్న ఫొటోలు!

Chiranjeevi new pics goes viral

  • 67 ఏళ్ల వయసులోనూ వేగంగా సినిమాలు చేస్తున్న చిరు
  • ఇటీవలే భోళాశంకర్ విడుదల
  • త్వరలోనే కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో సినిమా!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళాశంకర్. ఆ సినిమాలో చిరంజీవి డ్యాన్సులు, ఫైట్స్ చూసినవాళ్లు ఆయనకు 67 ఏళ్లంటే నమ్మలేరు. ఇటీవల మరింత స్లిమ్ గా మారిన చిరు, కుర్రాళ్లకు దీటుగా తన ఫిట్ నెస్ కాపాడుకుంటారనడంలో అతిశయోక్తి లేదు. 

తాజాగా చిరంజీవి ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. షర్టు, ప్యాంటు, చేతికి వాచీ, కాళ్లకు హాఫ్ షూ ధరించిన మెగాస్టార్ జెంటిల్మన్ లుక్ లో సింపుల్ గా దర్శనమిచ్చారు. ఎంతో కూల్ గా ఉన్న ఈ పిక్స్ అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి.

కొంతకాలం కిందట సినిమాలకు సుదీర్ఘ విరామం ఇచ్చిన చిరంజీవి... ఖైదీ నెం.150తో రీఎంట్రీ ఇచ్చారు. అక్కడ్నించి ఆయన స్పీడు మామూలుగా లేదు. సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య... ఇప్పుడు భోళాశంకర్ తో అభిమానులను క్రమం తప్పకుండా పలకరిస్తున్నారు. త్వరలో సోగ్గాడే చిన్ని నాయనా ఫేమ్ కల్యాణ్ కృష్ణ కురసాలతో చిరంజీవి ఓ చిత్రం చేయనున్నారు.

Chiranjeevi
New Pics
Megastar
Fans
  • Loading...

More Telugu News