Congress: లఢఖ్​లో ప్రజల భూమిని చైనా ఆక్రమించింది: రాహుల్ గాంధీ

China has taken away peoples land in Ladakh alleges Rahul Gandhi

  • ఈ విషయం అక్కడ ఎవరిని అడిగినా చెబుతారన్న కాంగ్రెస్ ఎంపీ
  • ప్రధాని మోదీ ఒక్క అంగుళం ఆక్రమణకు గురికాలేదంటున్నారని విమర్శ
  • కేంద్ర ఇచ్చిన హోదాతో లఢఖ్ ప్రజలు సంతోషంగా లేరన్న రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రస్తుతం లడఖ్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై ఆయన విమర్శలు చేశారు. చైనా ఆ ప్రాంతంలో ప్రజల భూమిని లాక్కుందన్నారు. ‘చైనా  సైన్యం ఈ ప్రాంతంలోకి ప్రవేశించింది. మన భూభాగాన్ని లాక్కుంది. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క అంగుళం భూమి కూడా చైనా ఆక్రమించలేదని అంటున్నారు. ఇది నిజం కాదు. మీరు ఇక్కడ ఎవరినైనా అడగవచ్చు’ అని రాహుల్ పేర్కొన్నారు. తూర్పు లడఖ్‌లో గత మూడేళ్లుగా భారత్, చైనా మధ్య సరిహద్దు ప్రతిష్టంభన ఏర్పడింది.. 2020 జూన్ లో గాల్వాన్ లోయలో జరిగిన ఘోరమైన ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 

లడఖ్ ప్రజలు తమకు హోదా ఇచ్చినందుకు సంతోషంగా లేరని రాహుల్ గాంధీ అన్నారు. ‘ఇక్కడి  ప్రజల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయి. వారికి ఇచ్చిన హోదాతో వారు సంతోషంగా లేరు. వారికి ప్రాతినిధ్యం కావాలి. నిరుద్యోగ సమస్య ఉంది. కేవలం అధికారులతోనే రాష్ట్రాన్ని నడపకూడదని అంటున్నారు. రాష్ట్రం ప్రజల గొంతుకతో నడపాలి’ అని రాహుల్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News