Nara Lokesh: నారా లోకేశ్ రాకతో పోటెత్తిన ప్రకాశం బ్యారేజి... ఫొటోలు ఇవిగో!

Nara Lokesh enters Vijayawada

  • ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముగిసిన యువగళం
  • విజయవాడ వద్ద ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రవేశం
  • జనసంద్రంలా మారిన ప్రకాశం బ్యారేజి పరిసరాలు
  • మిన్నంటిన టీడీపీ కార్యకర్తల కోలాహలం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లాలో పూర్తయింది. ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు ఈ సాయంత్రం యువగళం పాదయాత్రకు ప్రకాశం బ్యారేజి వద్ద వీడ్కోలు పలికారు. 

అనంతరం, ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతలు ప్రకాశం బ్యారేజి వద్ద లోకేశ్ కు అపూర్వ స్వాగతం పలికారు. నేతలు, కార్యకర్తలు పసుపు, ఎరుపు రంగు బెలూన్లతో యువనేతను స్వాగతించారు. భారీగా తరలివచ్చిన జనంతో ప్రకాశం బ్యారేజి పరిసరాలు జనసంద్రంగా మారాయి. బాణాసంచా మోతలు, నినాదాలతో  ప్రకాశం బ్యారేజి పరిసరాలు హోరెత్తాయి. అభిమానులు లోకేశ్ ను భారీ గజ మాలలు, పూల వర్షంతో ముంచెత్తారు. 

కాగా, కొండవీటి వాగు వద్ద లోకేశ్ కు బోట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వంలో తాము నష్టపోయిన తీరును వివరిస్తూ బోట్ అసోసియేషన్ ప్రతినిధులు గజమాల ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి తమకు పూర్వవైభవం తీసుకురావాలని ఆకాంక్షించారు. తమకు పూర్వవైభవం తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలంటూ కృష్ణా నదిలో పడవలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వెలిబుచ్చారు.

Nara Lokesh
Vijayawada
Prakasam Barrage
Yuva Galam Padayatra
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News