Akshay Kumar: అక్షయ్ కుమార్ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్.. నిర్మాత స్పందన ఇదే!

Producer clarifies on Akshay Kumar remuneration

  • ఘన విజయం సాధించిన 'ఓ మై గాడ్ 2' చిత్రం
  • ఈ సినిమాకు అక్షయ్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేద్న నిర్మాత
  • ఆర్థికంగా ఆయనే సాయం చేశారని వెల్లడి

అక్షయ్ కుమార్ కీలకపాత్ర పోషించిన 'ఓ మై గాడ్ 2' ఎన్నో వివాదాల మధ్య విడుదలై ఘన విజయాన్ని సాధించింది. విడుదలైన తొలి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకుని వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 150 కోట్లు వసూలు చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి అక్షయ్ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన అజిత్ అంధరే స్పందిస్తూ... ఈ వార్తలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని చెప్పారు. ఆయన భారీ పారితోషికం తీసుకున్నారనే వార్తల్లో నిజం లేదని... ఈ సినిమా కోసం అక్షయ్ కుమార్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. బడ్జెట్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటే అక్షయ్ ఆర్థికంగా సాయం చేశారని తెలిపారు. ఈ సినిమా నిర్మాతల్లో ఆయన కూడా ఒకరని... సినిమాల్లో వచ్చిన లాభాల్లో ఆయనకు కూడా వాటా ఉంటుందని చెప్పారు.

Akshay Kumar
Bollywood
Oh My God 2
Remuneration
  • Loading...

More Telugu News