bedurulanka 2012: చిరంజీవినే కాదు.. ఎవరినీ అలా అనకూడదు: బెదురులంక 2012 హీరో
- చిరంజీవిని ఎవరైనా విమర్శిస్తే బాధేస్తుందన్న కార్తికేయ
- సినిమా నచ్చకుంటే నచ్చలేదని.. బాగాలేదని చెప్పడం వరకు పర్వాలేదని వ్యాఖ్య
- వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదని హితవు
మెగాస్టార్ చిరంజీవిని ఎవరైనా విమర్శిస్తే బాధేస్తుందని బెదురులంక 2012 సినిమా కథానాయకుడు కార్తికేయ అన్నారు. చిరంజీవిపై వస్తోన్న ట్రోల్స్ గురించి అడగగా, కార్తికేయ మాట్లాడుతూ.. సినిమా నచ్చకుంటే నచ్చలేదని.. బాగాలేదని చెప్పడం వరకు పర్వాలేదని, కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదన్నారు.
చిరంజీవినే కాదు.. ఎవరినీ అలా అనవద్దన్నారు. అనుకున్న స్థాయిలో సినిమా ఆడకపోతే నేరం అవుతుందా? అన్నారు. చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో కష్టాలు చూశారని, ఆయన చూసిన ఒడిదుడుకుల ముందు ఇది (భోళాశంకర్) చాలా చిన్నదని, ప్రస్తుతం గురించి ఆలోచించకుండా ఆయన తదుపరి సినిమాపై దృష్టి పెడతారని తనకు అనిపిస్తోందన్నారు.
తన గత చిత్రం ఆర్ఎక్స్ 100, ఇప్పుడు బెదురులంక 2012 సినిమాల్లో తన పేరు శివ అని ఉండటం యాదృచ్ఛికంగా జరిగిందే అన్నారు. తన రెండు చిత్రాల ట్రైలర్లను రామ్ చరణ్ తేజ్ విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు.