Journalist Shot Dead: తాపీగా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్లి.. జర్నలిస్టు కాల్చివేత

Journalist Shot Dead In Bihars Araria District

  • బీహార్‌లోని అరారియా జిల్లాలో ఘటన
  • జర్నలిస్టులపై నలుగురు దుండుగుల కాల్పులు
  • గుర్తు తెలియని వ్యక్తుల కోసం పోలీసుల వేట

జర్నలిస్టు ఇంట్లోకి తాపీగా నడుచుకుంటూ వెళ్లిన కొందరు దుండగులు అతడిని తుపాకితో కాల్చి చంపారు. బీహార్‌లోని అరారియా జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బాధితుడిని బిమల్ యాదవ్‌గా గుర్తించారు. రాణిగంజ్‌లోని ఆయన ఇంటికి వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు బిమల్ యాదవ్‌పై తూటాల వర్షం కురిపించారు.

ఛాతీ భాగం నుంచి తూటాలు దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. పోస్టుమార్టం సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ, ఎంపీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Journalist Shot Dead
Bihar
Araria District
  • Loading...

More Telugu News