NDA: యూపీ ఉప ఎన్నిక: NDA Vs I.N.D.I.A. మధ్య ఉత్తరప్రదేశ్‌లో తొలి పోరు

First face off between NDA and INDIA to take Ghosi assembly seat

  • బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దారాసింగ్ చౌహాన్
  • గత ఎన్నికల్లో ఎస్పీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి, ఇటీవలే బీజేపీలో చేరిక
  • రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తోన్న దారాసింగ్
  • ఎస్పీకి కాంగ్రెస్, బీఎస్పీ మద్దతు

ఉత్తర ప్రదేశ్‌లోని ఘోసీ అసెంబ్లీ ఉప ఎన్నిక ద్వారా NDA - I.N.D.I.A. మధ్య తొలి ఎన్నికల పోరు ప్రారంభమవుతోంది. ఇక్కడి నుండి బీజేపీ అభ్యర్థిగా దారాసింగ్ చౌహాన్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇక, గత ఎన్నికల్లో ఇక్కడి నుండి సమాజ్‌వాది పార్టీ గెలవడంతో కాంగ్రెస్, బీఎస్పీలు ఉప ఎన్నికలకు దూరంగా ఉండి, I.N.D.I.A. కూటమిలోని సమాజ్‌వాది పార్టీకి మద్దతిస్తున్నాయి. అంటే ఇక్కడ బీజేపీ, ఎస్పీ మధ్య పోటీ ఉంటోంది. రేపటితో నామినేషన్ గడువు ముగియనుంది. సెప్టెంబర్ 5న ఉప ఎన్నిక జరగనుంది. సెప్టెంబర్ 8న ఫలితాలు రానున్నాయి.

దారాసింగ్ చౌహాన్ 2022కు ముందు యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో మంత్రిగా పని చేశారు. 2022 ఎన్నికలకు ముందు ఎస్పీలో చేరి, ఘోసీ నుండి గెలిచారు. అయితే ఈ ఏడాది జులైలో తిరిగి బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యంగా మారాయి. బీఎస్పీ, కాంగ్రెస్ తమ అభ్యర్థులను నిలబెట్టకుండా ఎస్పీకి మద్దతివ్వడంతో  NDA - I.N.D.I.A. మధ్య ఇది తొలి ఎన్నికగా చెప్పవచ్చు.

  • Loading...

More Telugu News