Rajanikanth: కమల్ - మణిరత్నం మూవీలో రజనీ!
![Rajani in Manirathnam movie](https://imgd.ap7am.com/thumbnail/cr-20230816tn64dcae1f9306e.jpg)
- కమల్ తో ప్రాజెక్టును ప్లాన్ చేసిన మణిరత్నం
- గతంలో ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'నాయకుడు'
- కీలకపాత్ర కోసం రజనీతో సంప్రదింపులంటూ టాక్
- త్వరలోనే రానున్న క్లారిటీ
వయసు పైబడుతున్న కారణంగా మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' తరువాత ఇక సినిమాలు చేయకపోవచ్చనే టాక్ ఆ మధ్య కోలీవుడ్ లో గట్టిగానే వినిపించింది. ఆ సినిమా షూటింగు సమయంలోనే ఆయన చాలా ఇబ్బంది పడ్డారని చెప్పుకున్నారు. అందువలన ఆయన ఇక సినిమాలకు గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందనే ప్రచారం ఒక వైపున నడుస్తూనే ఉంది.
ఈ నేపథ్యంలోనే ఆయన మరో మల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కమల్ ఈ సినిమాలో కథానాయకుడు అయినప్పటికీ, ఒక కీలకమైన పాత్రలో రజనీతో నటింపజేయాలనే ఉద్దేశంతో మణిరత్నం ఉన్నారని అంటున్నారు. అందుకు సంబంధించిన ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయని చెబుతున్నారు.
![](https://img.ap7am.com/froala-uploads/20230816fr64dcab9723e6b.jpg)