Uri: The Surgical Strike: కల్లోల మణిపూర్‌లో రెండు దశాబ్దాల తర్వాత హిందూ సినిమా బహిరంగ ప్రదర్శన

Hindi Film Screened In Manipur After 20 Years

  • మెయిటీ తీవ్రవాద సంస్థ హెచ్చరికతో 2000వ సంవత్సరంలో ఆగిపోయిన హిందీ చిత్రాల ప్రదర్శన
  • హెచ్ఎస్ఏ చొరవతో 23 ఏళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్ సినిమాను చూసిన మణిపూర్ వాసులు
  • ‘ఉరి: ద సర్జికల్ స్టైక్’ సినిమాను చూసేందుకు పోటెత్తిన జనం

కుకీ, మెయిటీ తెగల మధ్య ఘర్షణలతో మణిపూర్ మూడు నెలలుగా అట్టుడుకుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నిచర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితులు మాత్రం ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ బహిరంగంగా ప్రదర్శించిన ఓ హిందీ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. మణిపూర్‌లో ఓ హిందీ చిత్రాన్ని ప్రదర్శించడం రెండు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి.

మెయిటీ తీవ్రవాద సంస్థ ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’కి చెందిన రాజకీయ విభాగం రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ సెప్టెంబరు 2000వ సంవత్సరంలో హిందీ చిత్రాల ప్రదర్శనపై హెచ్చరికలు జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడి ప్రజలు బాలీవుడ్ సినిమాలకు దూరమయ్యారు.

తాజాగా, రాజధాని ఇంఫాల్‌కు 63 కిలోమీటర్ల దూరంలో ఉన్న చురాచాంద్‌పూర్ జిల్లా రెంగ్‌కైలోని ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో నిన్న బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన ‘ఉరి: ద సర్జికల్ స్టైక్’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సినిమాను చూసేందుకు జనం పోటెత్తారు. చిత్ర ప్రదర్శనకు ‘హమర్ స్టూడెంట్స్ అసోసియేషన్’ (హెచ్ఎస్ఏ) చొరవ తీసుకుంది.

  • Loading...

More Telugu News