Balineni Srinivasa Reddy: నేను చాలా స్లోగా ఉన్నానని సీఎం జగన్ అన్నారు: బాలినేని శ్రీనివాస్ రెడ్డి

balineni comments on ongole

  • వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్న బాలినేని
  • తమపై జరుగుతున్న ప్రచారాలను ఎవ్వరూ నమ్మొద్దని విజ్ఞప్తి
  • ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో స్లోగా ఉండటంపై జగన్‌కు వివరించానన్న మాజీ మంత్రి

వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఎంపీ సీటుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారని చెప్పారు. తాము పోటీ చేయడంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయని, వాటిని ఎవ్వరూ నమ్మొద్దని కోరారు. 

‘‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నేను చాలా స్లోగా ఉన్నానని సీఎం జగన్ అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యను తెలుసుకునే క్రమంలో ఆలస్యం అవుతోందని సీఎంకు వివరించాను” అని చెప్పారు. వేరే వాళ్లలా హడావుడిగా, మొక్కుబడిగా కాకుండా.. జనం సమస్యలను పరిష్కరించేలా ఒక్కో ఇంటికి ఎక్కువ సమయం కేటాయించడం వల్లే ఆలస్యమవుతోందని వివరణ ఇచ్చినట్లు చెప్పారు. తాను తప్పకుండా ప్రతి గడపకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు.

Balineni Srinivasa Reddy
ongole
Jagan
YSRCP
Magunta Sreenivasulu Reddy
  • Loading...

More Telugu News