west indies: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

West Indies win toss opts to bat first
  • ఐదు టీ20ల సిరీస్‌లో నాలుగో మ్యాచ్
  • రెండు మ్యాచ్‌లలో గెలిచిన విండీస్, ఒకటి గెలిచిన భారత్
  • ఈ మ్యాచ్‌లో గెలిచి సమం చేయాలని చూస్తోన్న భారత్
అమెరికాలోని ఫ్లోరిడాలో జరగనున్న నాలుగో ట్వంటీ 20లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకుంది. భారత్ - వెస్టిండీస్ మధ్య ఐదు ట్వంటీ 20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ రోజు నాలుగో మ్యాచ్ జరుగుతోంది. భారత్ మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడింది. మూడో మ్యాచ్‌లో నెగ్గింది. ఇందులో గెలిస్తే సిరీస్‌ 2-2తో సమమవుతుంది. అప్పుడు ఐదో మ్యాచ్ కీలకంగా మారనుంది. ఫ్లోరిడాలో భారత్, వెస్టిండీస్ మధ్య ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు జరగగా, నాలుగింట టీమిండియా, ఒకదాంట్లో విండీస్ గెలిచింది. ఒక మ్యాచ్ రద్దయింది.

భారత్ తుది జట్టు... యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, ముఖేశ్ కుమార్, యజ్వేంద్ర చాహల్ ఉన్నారు.

విండీస్ జట్టు... కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, షై హోప్, నికోలస్ పూరన్, రోవ్ మెన్ పావెల్, హెట్‌మెయర్, జేసన్ హోల్డర్, రొమారియో షేఫర్డ్, ఒడియన్ స్మిత్, అకీల్ హోసిన్, మెకాయ్ ఉన్నారు.
west indies
india
Cricket

More Telugu News