Sharmila: ఢిల్లీలో షర్మిల.. నేడు రాహుల్‌తో భేటీ?

sharmila willl meet rahul gandhi in delhi

  • కాంగ్రెస్‌లో వైఎస్సార్‌‌టీపీని విలీనం చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం
  • బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లిన షర్మిల
  • పార్టీ విలీనంపై ఖర్గే, రాహుల్‌ గాంధీతో చర్చించే అవకాశం

వైఎస్సార్‌‌ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల.. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం  జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీకి షర్మిల వెళ్లారు. బెంగళూరు నుంచి హస్తిన చేరుకున్న ఆమె.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నట్లు సమాచారం. 

కాంగ్రెస్‌లో వైఎస్సార్‌‌టీపీ విలీనంపై వీరితో షర్మిల చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వారంలోనే కాంగ్రెస్ కీలక నేత సోనియా గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు షర్మిల సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఎలాంటి షరతులు లేకుండానే తన పార్టీని విలీనం చేసేందుకు ఒప్పుకున్నట్లు చర్చ సాగుతోంది. పాలేరు నుంచి షర్మిల బరిలోకి దిగుతారని నేతలు చెబుతున్నారు.

Sharmila
Rahul Gandhi
Congress
Mallikarjun Kharge
Delhi
YSRTP
  • Loading...

More Telugu News