Andhra Pradesh: ఎవరికో ఫిర్యాదు చేస్తే భయపడే ప్రభుత్వం కాదిది: పవన్ కల్యాణ్ కు మంత్రి అమర్నాథ్ కౌంటర్

Minister Gudivada Amarnath fires on pawan kalyan
  • కేంద్రంలో అంత పలుకుబడే ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలని సవాల్
  • వైజాగ్ పర్యటనలో స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదేమని ప్రశ్న
  • బైడెన్ కు, పుతిన్ కు చెప్పుకున్నా భయపడేవారు ఎవరూ లేరని ఎద్దేవా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కేంద్ర ప్రభుత్వంలో అంత పలుకుబడి ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ చాలెంజ్ చేశారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. తాము చేసిన తప్పేంటని, కేంద్రానికి ఏమని ఫిర్యాదు చేస్తారని నిలదీశారు. ఎవరికో ఫిర్యాదుచేస్తే భయపడే ప్రభుత్వం కాదని, జగన్ సర్కారు ఎవరికీ భయపడబోదని స్పష్టం చేశారు. కేంద్రానికి కాకుంటే అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు కానీ, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కు కానీ.. ఎవరికైనా చెప్పుకొమ్మంటూ మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు.

వైజాగ్ లో పర్యటించిన పవన్ కల్యాణ్ స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదేమని మంత్రి నిలదీశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ వైఖరేంటని ప్రశ్నించారు. ఈమేరకు విశాఖ సర్క్యూ ట్ హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. సీఎం జగన్ పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను మంత్రి తప్పుబట్టారు.

Andhra Pradesh
Gudivada Amarnath
YSRCP
press meet
Pawan Kalyan
Janasena
Vizag
Vizag Steel Plant

More Telugu News