sandwich: శాండ్ విచ్ ను రెండుగా కట్ చేసినందుకు చార్జీ రూ.182

Italian cafe charges Rs 182 for cutting sandwich into half

  • ఒక కాఫీ చార్జీ రూ.108
  • కానీ శాండ్ విచ్ రెండు ముక్కలు చేసినందుకు రెట్టింపు చార్జీ
  • ఇటలీలోని ఓ రెస్టారెంట్ లో స్పెషల్ బాదుడు

రెస్టారెంట్ కు వెళ్లి శాండ్ విచ్ ఆర్డర్ చేస్తే, కొన్ని నిమిషాల్లో అది మన టేబుల్ పై ఉంటుంది. దాన్ని రెండు పీసులుగా కట్ చేయాలని కోరితే.. సింపుల్ గా చేసిస్తారు. కానీ, అది మన దేశంలోనే పరిమితం.! ఇటలీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం, లేక్ కోమో సమీపంలో ఉన్న ఓ రెస్టారెంట్ కు వెళితే భిన్నమైన అనుభవం ఎదురవుతుంది. బార్ పేస్ రెస్టారెంట్ కు ఓ వ్యక్తి వెళ్లి శాండ్ విచ్ ఆర్డర్ చేశాడు. దాన్ని రెండు పీసులుగా చేసి ఇవ్వాలని కోరాడు. తీరా తిన్న తర్వాత బిల్లు చూసిన అతడు, అయోమయం ముఖం పెట్టేశాడు. 

విషయం ఏమిటంటే, శాండ్ విచ్ ను రెండు పీసులుగా చేసినందుకు కూడా చార్జీ విధించారు. శాండ్ విచ్ ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటే చార్జీ 7.50 యూరోలు. దీనికి కట్ చేసినందుకు 2 యూరోలు విధించారు. ఒక యూరో మన కరెన్సీలో అయితే రూ.90. అంటే రెండు పీసులు చేసినందుకు రూ.180 వసూలు చేసినట్టయింది. అదే బిల్లులో ఒక కాఫీకి విధించిన చార్జీ 1.20 యూరోలే. అంటే కాఫీ కంటే చాకుతో రెండు ముక్కలు చేసిచ్చినందుకు రెస్టారెంట్ రెట్టింపు చార్జీలను బాదేసింది. 

ఇదేం దారుణం? అని ప్రశ్నించగా.. అదనపు అభ్యర్థనల వల్ల తమపై అదనపు వ్యయ భారం పడుతుందని రెస్టారెంట్ యజమాని క్రిస్టినా బైచి చెప్పడం గమనార్హం. ‘‘రెండు పీసులుగా చేయడం వల్ల వాటికి రెండు ప్లేట్లు వాడాలి. అటువంటప్పుడు రెండు ప్లేట్లు కడుక్కోవాలి. ఇందుకు పట్టే సమయం, శ్రమకు ఆ మాత్రం చార్జీ అవుతుంది’’ అని వివరణ ఇవ్వడం కొసమెరుపు.

More Telugu News