Flipkart: ఫ్లిప్ కార్ట్ లో మరో జాతర... ఎప్పటి నుంచి అంటే...!

Flipkart announces another sale

  • పోటాపోటీగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్ డిస్కౌంట్ సేల్స్
  • తాజాగా బిగ్ బచత్ ధమాల్ సేల్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్
  • ఆగస్టు 11 నుంచి 13 వరకు విక్రయాలు
  • పలు మోడళ్ల స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై భారీ డిస్కౌంట్లు
  • క్రెడిట్ కార్డులతో మరో 10 శాతం రాయితీ పొందే అవకాశం 

ఈ-కామర్స్ పోర్టళ్లు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వినియోగదారులను ఆకర్షించేందుకు పోటాపోటీగా డిస్కౌంట్లతో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అమెజాన్ ఇటీవలే గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో రాయితీల బొనాంజా నిర్వహించగా... ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో అమ్మకాలు నిర్వహించింది. 

ఫ్లిప్ కార్ట్ తాజాగా మరో భారీ డిస్కౌంట్ల జాతరకు రంగం సిద్ధం చేసింది. ఫ్లిప్ కార్ట్ లో రేపటి (ఆగస్టు 11) నుంచి 13 వరకు బిగ్ బచత్ ధమాల్ సేల్ పేరుతో విక్రయాలు చేపట్టనున్నారు. బిగ్ బచత్ ధమాల్ సేల్ లో 1 లక్షకు పైగా వస్తువులు రాయితీ ధరలకు లభ్యం కానున్నాయి. 

కొన్ని వస్తువులపై ఏకంగా 80 శాతం డిస్కౌంటు ఇస్తుండడం నిస్సందేహంగా వినియోగదారులను ఆకట్టుకునే అంశమే. దుస్తులు, ఫ్యాషన్ ఉపకరణాలపై 60-80 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఎప్పట్లాగానే స్మార్ట్ ఫోన్ల వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై భారీ తగ్గింపులు ఉండనున్నాయి. 

వాషింగ్ మెషీన్లపై 60 శాతం డిస్కౌంట్లు ఇచ్చే అవకాశాలున్నాయి. క్రెడిట్  కార్డుల ద్వారా కొనుగోళ్లతో మరో 10 శాతం వరకు అదనపు రాయితీ పొందే వీలుంది.

Flipkart
Big Bachat Dhamaal
Sales
Offers
  • Loading...

More Telugu News