Hyderabad: సీఏ పరీక్షలో కుమారుడు ఫెయిల్.. తల్లి ఆత్మహత్య

hyderabad woman commits suicide after son fails to clear ca exam

  • హైదరాబాద్ శివారులోని జీడిమెట్లలో ఘటన
  • కుమారుడు సీఏ పరీక్షలో ఫెయిలవ్వడంతో తీవ్ర ఒత్తిడిలో తల్లి
  • బిడ్డ భవిష్యత్తుపై బెంగతో బుధవారం మహిళ ఆత్మహత్య 

సీఏ పరీక్షలో కుమారుడు ఫెయిలయ్యాడని తల్లడిల్లిపోయిన ఓ మహిళ కొడుకు భవిష్యత్తుపై బెంగతో ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే, గాజులరామారంలోని బాలాజీ ఎన్‌క్లేవ్‌లో నివసించే నాగభూషణం, పుష్పజ్యోతి(41) దంపతులకు ఇద్దరు కుమారులు. నాగభూషణం ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు.  

ఇటీవల వారి కుమారుడు ఒకరు చార్టర్డ్ అకౌంటెన్సీ పరీక్ష రాసి ఫెయిల్ అయ్యాడు. దీంతో, పుష్పజ్యోతి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. కుమారుడి భవిష్యత్తుపై బెంగపెట్టుకున్న ఆమె బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుంది. కుటుంబసభ్యులు వచ్చి చూసేసరికే ఆమె మరణించింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

  • Loading...

More Telugu News