K Narayana Swamy: సినిమాకు రూ.100 కోట్లు తీసుకునే హీరోలు పన్ను కడుతున్నారా?: డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- తమ వద్ద పని చేసే వారికి సక్రమంగా వేతనాలు ఇస్తున్నారా? అని నిలదీత
- తక్కువ వేతనం ఇచ్చి వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ఆరోపణ
- పవన్ కల్యాణ్ 175 స్థానాల్లో పోటీ చేయగలరా? అని ప్రశ్న
- పిచ్చికుక్కలు ఒక్కటై తమలో తామే కరుచుకుంటున్నారని ఎద్దేవా
ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల నుండి రూ.100 కోట్లు తీసుకునే పెద్ద హీరోలు పన్నులు కడుతున్నారా? అని ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రశ్నించారు. వారు తమ వద్ద పని చేసే వారికి సక్రమంగా వేతనాలు ఇస్తున్నారా? చెప్పాలని నిలదీశారు. తక్కువ వేతనం ఇచ్చి వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. పిచ్చికుక్కలు అన్నీ ఒకటై ఎవరిని కరవాలో తెలియక వారిలో వారే కరుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కాగా, పుంగనూరు ఘటనలో పలువురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయని, శాంతిభద్రతల విషయంలో పోలీసులు అద్భుతంగా పని చేశారని అంతకుముందు ఆయన అన్నారు. ఈ ఘటనకు టీడీపీ అధినేత చంద్రబాబే కారణమన్నారు. ఘటనలో నిందితులందరిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీని ఆదేశించినట్లు చెప్పారు. పుంగనూరు ఘటనలో గాయపడిన కానిస్టేబుళ్లను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు.