Atchannaidu: జగన్ ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు: అచ్చెన్నాయుడు

Jagan is in frustration says Atchannaidu

  • చంద్రబాబుపై కేసు జగన్ పిరికితనానికి నిదర్శనమన్న అచ్చెన్నాయుడు
  • తప్పుడు కేసులతో టీడీపీని అడ్డుకోలేరని వ్యాఖ్య
  • వైసీపీ ర్యాలీలు, ధర్నాలకు ఎలా అనుమతిస్తారని ప్రశ్న

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అంగళ్లు, పుంగనూరులో దాడులకు ఉసిగొల్పింది ముఖ్యమంత్రి జగనే అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రబాబుపై కేసు నమోదు చేయడం జగన్ పిరికితనానికి నిదర్శనమని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంతో జగన్ లో వణుకు మొదలయిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఆయనపై కేసు పెట్టారని అన్నారు. తప్పుడు కేసులతో టీడీపీని అడ్డుకోలేరని చెప్పారు. రోడ్ షోలకు వస్తున్న ప్రజాస్పందనను చూసి జగన్ ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ పర్యటిస్తున్న రూట్ లో వైసీపీ వాళ్లకు ఏం పని? అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ర్యాలీలు, ధర్నాలకు పోలీసులు ఎలా అనుమతిస్తారని విమర్శించారు. దాడులు చేసిన వారిని వదిలేసి బాధితులపైనే కేసులు పెట్టించడం జగన్ కే చెల్లిందని అన్నారు.

Atchannaidu
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
  • Loading...

More Telugu News