fancy number: ఫ్యాన్సీ నెంబర్ వేలం ద్వారా రూ.53 లక్షలకు పైగా ఆదాయం

TS RTA gets huge revenue by auction fancy numbers
  • అత్యధికంగా రూ.21,60,000 పలికిన టీఎస్ 09 జీసీ 9999
  • కొనుగోలు చేసిన ప్రైమ్ సోర్స్ గ్లోబల్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్
  • అత్యల్పంగా రూ.1,30,000 పలికిన టీఎస్ 09 జీడీ 0007
ఫ్యాన్సీ నెంబర్లు రవాణా శాఖకు కాసుల పంట కురిపిస్తాయి. తాజాగా తెలంగాణ రవాణా శాఖకు ఫ్యాన్సీ నెంబర్ వేలం ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మంగళవారం ఒక్కరోజే రూ.53,34,894 ఆదాయం వచ్చింది. ఈ వేలంలో అత్యధికంగా టీఎస్ 09 జీసీ 9999 ఏకంగా రూ.21,60,000 పలికింది. దీనిని ప్రైమ్ సోర్స్ గ్లోబల్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది.

టీఎస్ 09 జీడీ 0009 ను రూ.10,50,000కు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్,
టీఎస్ 09 జీడీ 0001 ను రూ.3,01,000కు ఆంధ్రా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రయివేట్ లిమిటెడ్,
టీఎస్ 09 జీడీ 0006 ను రూ.1,83,000కు గాయజ్ జ్యువెల్లర్స్ ప్రయివేట్ లిమిటెడ్,
టీఎస్ 09 జీడీ 0019 ను రూ.1,70,000కు సితారా ఎంటర్టైన్మెంట్స్,
టీఎస్ 09 జీడీ 0045 ను రూ.1,55,000కు సాయి పృధ్వీ ఎంటర్ ప్రైజెస్,
టీఎస్ 09 జీడీ 0007 ను రూ.1,30,000కు ఫైన్ ఎక్స్‌పర్ట్స్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్,
టీఎస్ 09 జీడీ 0027 ను రూ.1,04,999కు శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కొనుగోలు చేసింది.
fancy number
rta
Telangana

More Telugu News