Chiranjeevi: భోళా శంకర్ సెట్స్ పై చిరు ఇలా... పొటోలు ఇవిగో!

Chiranjeevi on Bhola Shankar sets

  • చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్
  • మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం
  • చిరంజీవి సరసన కథానాయికగా తమన్నా
  • మెగాస్టార్ కు చెల్లెలిగా కీర్తి సురేశ్
  • భారీ ఎంటర్టయినర్ గా రూపుదిద్దుకున్న భోళా శంకర్

మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన భోళా శంకర్ చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మెగా ఎంటర్టయినర్ మూవీలో చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేశ్ నటించడం విశేషం. 

ఆగస్టు 11న భోళా శంకర్ రిలీజవుతున్న నేపథ్యంలో చిత్రబృందం వీలైనన్ని అన్ని మార్గాల్లో ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా, అభిమానులను అలరించేందుకు భోళా శంకర్ సెట్స్ పై చిరంజీవి వర్కింగ్ స్టిల్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంది. 

కాగా, ప్రమోషన్ ఈవెంట్స్ లో చిరంజీవి సైతం పాల్గొంటూ భోళా...పై అంచనాలను మరింత పెంచేస్తున్నారు.

More Telugu News