girl: ప్రియుడిపై ఆగ్రహంతో 80 అడుగుల విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కిన యువతి

Angry at boyfriend girl climbs 80 feet high tower
  • ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటన
  • ప్రియుడితో వాగ్వివాదం.. ఆగ్రహంతో టవర్ ఎక్కిన యువతి
  • ఆమెను కిందకు తీసుకొచ్చేందుకు ప్రియుడు సైతం అదే పని
ఓ ప్రేమ జంట మధ్య కోపం కట్టలు తెంచుకుంది. ఆ తర్వాత ఆ జంట చేసిన పని గ్రామంలో పెద్ద వినోదంగా మారిపోయింది. ప్రియుడితో వాదనకు దిగిన యువతి కోపంతో అక్కడే ఉన్న 80 అడుగుల ఎత్తయిన విద్యుత్ హైటెన్షన్ టవర్ పైకి ఎక్కింది. ఆమెను బుజ్జగించి కిందకు తీసుకువద్దామని చెప్పి ఆ యువకుడు కూడా టవర్ పైకి ఎక్కాడు. ఒకరి ద్వారా ఒకరికి విషయం తెలియడంతో ఆ టవర్ దగ్గరకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం గరేలా పెండ్ర మర్వాహి జిల్లాలో జరిగింది. 

గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కానీ యువతి శాంతించలేదు. పోలీసులు టవర్ పై ఉన్న జంటతో సదీర్ఘంగా చర్చలు నిర్వహించింది. వారికి ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. చివరికి కొన్ని గంటల తర్వాత కిందకు దిగి వచ్చారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. యువతీ, యువకుడిని హెచ్చరించి పంపించారు. భవిష్యత్తులో ఇలాంటివి చేయవద్దని నచ్చజెప్పారు. 
girl
boy friend
climbed
high tension line
80 feets hight

More Telugu News