Viral Videos: పాము, ఆవు మధ్య స్నేహం..వీడియో ఇదిగో!

Video Of Cow And Snake Playing Together Goes Viral

  • అసాధారణ వీడియో షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద
  • పాము, ఆవు బంధం చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
  • ప్రకృతి సంక్లిష్టమైనదంటూ కామెంట్స్

అటవీ శాఖ అధికారి సుశాంత నంద షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియోలో ఆవు, పాము స్నేహంగా మసలుకోవడం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇందులో పాము, ఆవు పక్కపక్కనే ఉన్నాయి. వాటి మధ్య ఎటువంటి వైరభావం కనిపించలేదు సరికదా రెండూ పరస్పర నమ్మకంతో స్నేహంగా ఉన్నట్టు కనిపించాయి. ఈ అసాధారణ బంధం వెనుక కారణాలను వివరించడం కష్టమని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్వీట్ చేశారు. పరస్పర నమ్మకం, ప్రేమతో ఈ బంధం ఏర్పడిందని కామెంట్ చేశారు. 

వీడియో చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ప్రకృతి సంక్లిష్టమైందని, స్వానుభవంతోనే అది అర్థమవుతుందని చెప్పుకొచ్చారు. ఆ రెండూ తమదైన భాషలో మాట్లాడుకుంటున్నాయని, ఇది మనుషులకు అందనిదని మరికొందరు వ్యాఖ్యానించారు.

Viral Videos
Cow
Snake

More Telugu News