Abbas: అప్పుడు నన్ను వెక్కిరిస్తూ వీడియోలు చేశారు: అబ్బాస్

Tollywood Actor Abbas About Toilet Cleaner Ad

  • ‘ప్రేమదేశం’ సినిమాతో యూత్‌లో ఫాలోయింగ్ తెచ్చుకున్న అబ్బాస్
  • ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా కలిసి రాని వైనం
  • క్రమంగా సినిమాలకు దూరం
  • పరిశుభ్రతపై అవగాహన కోసమే టాయిలెట్ క్లీనర్ యాడ్‌లో చేశానని వెల్లడి
  • ఆ ప్రకటనలో నటించినందుకు చాలా ట్రోల్స్ వచ్చాయని ఆవేదన

‘ప్రేమదేశం’ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు అబ్బాస్. అప్పట్లో ఆయనకు వచ్చిన ఫేమ్ అంతా ఇంతా కాదు. అయితే, ఆ తర్వాత ఒకటీ అరా తప్ప పెద్దగా సినిమాలు లేకపోవడంతో క్రమంగా పరిశ్రమకు దూరమయ్యారు. అయితే, ఓ టాయిలెట్ క్లీనర్ యాడ్‌లో మాత్రం చాలాకాలం కనిపించారు. ఆ యాడ్ తర్వాత తాను చాలా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చిందని తాజాగా అబ్బాస్ వెల్లడించారు. 

పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే తాను ఆ ప్రకటనలో నటించినట్టు తెలిపారు. ఆ యాడ్ తర్వాత తనను వెక్కిరిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు చేశారని, అయినా అవేవీ తనను బాధపెట్టలేదన్నారు. ఆ యాడ్ వచ్చినప్పుడు తాను బిజీగా లేనని, వాళ్లు తనకు 8 సంవత్సరాల కాంట్రాక్ట్ ఇవ్వడంతోపాటు మంచి రెమ్యునరేషన్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. అలా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకున్నానని, అందులో తప్పేముందని ప్రశ్నించారు.

More Telugu News