Jesus Alberto Lopez Ortiz: మొసలికి ఆహారంగా మారిన ఫుట్ బాల్ ఆటగాడు... వీడియో ఇదిగో!

Crocodile pulls off Soccer player into waters

  • కోస్టారికా ఫుట్ బాల్ రంగంలో విషాదం
  • వ్యాయామం సందర్భంగా నదిలో దూకిన ఆటగాడు
  • వెంటనే నోటకరుచుకుని లాక్కెళ్లిన భారీ మొసలి
  • తుపాకులతో వేటాడి మొసలిని అంతమొందించిన పోలీసులు

కోస్టారికా దేశం ఫుట్ బాల్ రంగంలో విషాదం నెలకొంది. ఓ ఫుట్ బాల్ క్రీడాకారుడు మొసలికి బలయ్యాడు. ఆ సాకర్ ఆటగాడి పేరు జీసస్ ఆల్బర్టో లోపెజ్ ఆర్టిజ్. ఆర్టిజ్ అవశేషాలను అధికారులు అతికష్టమ్మీద వెలికి తీశారు. ఆ మొసలిని చంపడానికి స్థానిక పోలీసులు తుపాకులు ఉపయోగించాల్సి వచ్చింది. 

కోస్టారికా రాజధాని శాన్ జోస్ కు 140 మైళ్ల దూరంలోని శాంటాక్రజ్ అనే పట్టణం వద్ద ఈ ఘటన జరిగింది. ఆర్టిజ్ మూసివేసి ఉన్న ఓ ఫిషింగ్ బ్రిడ్జి పైనుంచి కనాస్ నదిలో దూకగా, ఓ పెద్ద మొసలి అతడిని నోటకరుచుకుని లాక్కెళ్లడం చూపరులకు ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. 

వ్యాయామం చేస్తున్న సమయంలో ఆర్టిజ్ నదిలో దూకాడు. అయితే ఆ నది మొసళ్లకు ఆవాసం అని తెలిసి కూడా అతడు దూకడం వెనుక కారణాలు ఏంటన్నది తెలియరాలేదు. 29 ఏళ్ల ఆర్టిజ్ డిపోర్టివో రియో కనాస్ అనే ఫుట్ బాల్ క్లబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Jesus Alberto Lopez Ortiz
Crocodile
Soccer
Costarica

More Telugu News