Daggubati Purandeswari: ఇదే కదా నేను చెప్పింది సీఎం గారూ!: పురందేశ్వరి

Purandeswari once again criticizes YCP govt

  • ఓ ఆంగ్ల మీడియా కథనం ఆధారంగా పురందేశ్వరి విమర్శనాస్త్రాలు
  • రూ.1.10 లక్షల కోట్లు అనధికారికంగా ఖర్చు చేసినట్టు వెల్లడి 
  • ఇందుకు కాగ్ తప్పుబట్టిందన్న పురందేశ్వరి 

ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఇటీవల తాను చేస్తున్న విమర్శలకు విజయసాయిరెడ్డి వంటి వైసీపీ అగ్రనేత కౌంటర్ ఇస్తున్నప్పటికీ పురందేశ్వరి ఏమాత్రం తగ్గడంలేదు. 

ఓ జాతీయ మీడియా సంస్థలో వచ్చిన కథనం ఆధారంగా ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. కేవలం ఒక్క సంవత్సరం (2020-21)లోనే ఏపీ ప్రభుత్వం లెక్కల్లో చూపకుండా రూ.1.10 లక్షల కోట్లు అనధికారికంగా ఖర్చు చేసినట్టు కాగ్ తప్పుబట్టిందని ఆమె వెల్లడించారు. 

ఈ నిధులు... మద్యం అమ్మకాలు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు, ఉద్యోగుల జీపీఎస్, ఎన్పీఎస్ పీఎఫ్ లు, గ్రామ పంచాయతీల నుంచి దారిమళ్లించినవి కావా? అని ప్రశ్నించారు. ఇదే కదా నేను చెప్పింది ముఖ్యమంత్రి గారూ... దీనికి మీ సమాధానం ఏమిటి? అంటూ పురందేశ్వరి ట్వీట్ చేశారు. అంతేకాదు, సదరు ఆంగ్ల మీడియా కథనాన్ని కూడా పంచుకున్నారు.

Daggubati Purandeswari
BJP
AP Govt
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News