Sanjay Dutt: 'డబుల్ ఇస్మార్ట్' కోసం సంజయ్ దత్ పారితోషికం ఎంతంటే ..!

Double Ismart Movie Update

  • పూరి దర్శకుడిగా రూపొందుతున్న 'డబుల్ ఇస్మార్ట్'
  • గతంలో హిట్ కొట్టిన 'ఇస్మార్ట్ శంకర్'కి ఇది సీక్వెల్
  • విలన్ గా కనిపించనున్న సంజయ్ దత్ 
  • 60 రోజులకు గాను 15 కోట్ల పారితోషికం?

బాలీవుడ్ స్టార్ హీరోలంతా ఇప్పుడు తెలుగులో విలన్ రోల్స్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుండటమే ఇందుకు ప్రధానమైన కారణమని చెప్పచ్చు. ఆల్రెడీ ఇక్కడ జాకీ ష్రాఫ్ .. మిథున్ చక్రవర్తి .. చుంకీ పాండే విలన్స్ గా చేశారు. 

సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేసిన 'ఆది పురుష్' సంగతి అలా ఉంచితే, ఎన్టీఆర్ 'దేవర'లోను ఆయన ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలోనే నేరుగా తెలుగు సినిమాలలో విలన్ గా చేయడానికి సంజయ్ దత్ కూడా రంగంలోకి దిగిపోయాడు. 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలో ఆయన పవర్ఫుల్ విలన్ గా కనిపించనున్నాడు. 

రామ్ - పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతోంది. ముంబై నేపథ్యంలో ఈ కథ నడవనుంది. ఈ సినిమా చేయడానికి సంజయ్ దత్ 60 రోజులను కేటాయించారట. ఇందుకుగాను ఆయన 15 కోట్ల పారితోషికాన్ని అందుకున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా వదిలిన ఆయన ఫస్టు లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

Sanjay Dutt
Ram
Puri Jagannadh
  • Loading...

More Telugu News