Vikranth: యాక్షన్ థ్రిల్లర్ గా 'స్పార్క్' .. దూసుకుపోతున్న టీజర్!

Spark movie update

  • భారీ యాక్షన్ థ్రిల్లర్ గా 'స్పార్క్'
  • హీరోగా .. దర్శకుడిగా విక్రాంత్ పరిచయం
  • హీరోయిన్స్ గా మెహ్రీన్ - రుక్సర్ థిల్లాన్ 
  • కీలకమైన పాత్రను పోషించిన సుహాసిని 

తెలుగు తెరకి మరో కొత్త హీరో పరిచయమవుతున్నాడు .. ఆ హీరో పేరే విక్రాంత్. ఆయన మొదటి సినిమాగా 'స్పార్క్' రూపొందింది. ఈ సినిమాకి ఆయనే దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమాకి లీలారెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. 

లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ నేపథ్యంలోని సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. విక్రాంత్ కి ఇది మొదటి సినిమానే అయినా, భారీ మొత్తంలోనే ఖర్చు చేశారనే విషయం టీజర్ చూస్తేనే తెలిసిపోతోంది. పాటలను విదేశాల్లోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించారని అర్థమైపోతోంది. 

హీరో ఎక్కువగా హింసకు పాల్పడటం చూపించారు. కథా పరంగా అందుకు గల కారణం ఏమిటనేది చూడాలి. 'ఎఫ్ 3' తరువాత మెహ్రీన్ చేసిన సినిమా ఇదే. ఇక మరో నాయికగా రుక్సర్ థిల్లాన్ కనిపిస్తోంది. సుహాసిని .. నాజర్ .. వెన్నెల కిశోర్ .. బ్రహ్మాజీ .. సత్య ముఖ్యమైన పాత్రలను పోషించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

Vikranth
Mehreen
Rukshar Dhillon
Spark Movie

More Telugu News