ott: రేపటి నుంచి ఓటీటీలోకి దయా, రంగబలి, పరేషాన్!
![Dayaa web series Rangbali and Pareshan in OTT from tomorrow](https://imgd.ap7am.com/thumbnail/cr-20230803tn64cb3b3d7172f.jpg)
- హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవనున్న దయా వెబ్ సిరీస్
- నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్న రంగబలి
- సోని లివ్‌లోకి పరేషాన్ సినిమా
ఇది వరకు శుక్రవారం వచ్చిందంటే సినీ ప్రియులు థియేటర్లకు బారులు తీరేవారు. తమ అభిమాన హీరో, హీరోయిన్ల సినిమాల ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ల కోసం పోటీ పడేవారు. కానీ, ఓటీటీల హవా మొదలయ్యాక ఎంచక్కా ఇంట్లోనే సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేస్తున్నారు. వాళ్ల అభిరుచికి తగ్గట్టుగా ప్రతివారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయి. ఈ శుక్రవారం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పలు చిత్రాలు స్ట్రీమ్ అవబోతున్నాయి.
అందులో మొదటిది జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన దయా వెబ్ సిరీస్. ఇది హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవనుంది. ఇక నాగశౌర్య నటించిన రంగబలి చిత్రం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. అందరిలో ఆసక్తి పెంచిన చిన్న సినిమా ‘పరేషాన్’ సోనీ లివ్‌లో రేపటి నుంచి అందుబాటులోకి వస్తుంది.