Gudivada Amarnath: దసరాకు విశాఖ ప్రజల కోరిక నెరవేరనుంది: మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Amarnath Reddy interesting comments

  • పార్టీ నాయకత్వం కోరుకున్న శుభపరిణామం జరుగుతుందన్న మంత్రి
  • దసరాకు విశాఖ ప్రాంతానికి బ్రహ్మాండమైన కానుక వస్తుందని వ్యాఖ్య
  • పార్టీకి అన్యాయం చేసిన నలుగురిపై వేటు వేసిన ధైర్యం జగన్‌ది అన్న అమర్నాథ్

ఈ దసరాకు విశాఖ ప్రజల కోరిక నెరవేరనుందని, పార్టీ నాయకత్వం కోరుకున్న శుభపరిణామం జరుగుతుందని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యల ద్వారా సీఎం జగన్ విశాఖకు రానున్నారనే పరోక్ష సంకేతాలు ఇచ్చారని పార్టీలో భావిస్తున్నారు.

విశాఖలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ... దసరాకు మన ప్రాంతానికి బ్రహ్మాండమైన కానుక వస్తోందన్నారు. జగన్ ఇక్కడ వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి కార్యకలాపాలకు నిన్ననే శంకుస్థాపన చేశారన్నారు. మొదటి నుండి పార్టీ కోసం పని చేసిన వారికి పార్టీలో అన్యాయం జరగదని చెప్పారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి అన్యాయం చేసిన నలుగురిపై వేటు వేసిన ధైర్యం జగన్‌దే అన్నారు.

Gudivada Amarnath
YSRCP
Andhra Pradesh
Visakhapatnam District
  • Loading...

More Telugu News