Chandrababu: చంద్రబాబు పులివెందుల పర్యటనలో ఉద్రిక్తత

Tensions raises in Chandrababu Pulivendula tour
  • కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • జమ్మలమడుగు నుంచి పులివెందుల బయల్దేరిన టీడీపీ అధినేత
  • టీడీపీ సభా వేదిక వద్దకు ఓపెన్ టాప్ వాహనంలో వచ్చిన వైసీపీ కార్యకర్తలు
  • టీడీపీ నేతలను రెచ్చగొడుతూ వైసీపీ జెండాల ప్రదర్శన
టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లా జమ్మలమడుగులో రోడ్ షో అనంతరం పులివెందుల బయల్దేరారు. చంద్రబాబు రాక నేపథ్యంలో, పులివెందులలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు సభా ప్రాంగణానికి ఓపెన్ టాప్ వాహనంలో వచ్చిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. తమ సభ జరిగే చోట వైసీపీ జెండాలు ప్రదర్శిస్తుండడంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ జెండాలతో వచ్చిన ఆ వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు వెంబడించారు. అయితే, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
Chandrababu
Pulivendula
TDP
YSRCP
Kadapa District

More Telugu News