SSS: 'SSS' పేరుతో అంబటి రాంబాబుపై సినిమా.. ముహూర్తపు షాట్ చిత్రీకరించిన తిరుపతి జనసేన నేతలు  

Janasen movie SSS on Ambati Rambabu

  • వైసీపీ, జనసేన మధ్య చిచ్చు రాజేసిన 'బ్రో'
  • 'సందులో సంబరాల శాంబాబు' సినిమా ముహూర్తపు షాట్ తీసిన జనసేన
  • హీరోయిన్లను రెడ్ లైట్ ఏరియా నుంచి తెస్తామని వ్యాఖ్య

'బ్రో' సినిమా వైసీపీ, జనసేనల మధ్య వైరాన్ని మరింత పెంచింది. సినిమాలతో పవన్ కల్యాణ్ తనను టార్గెట్ చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పవన్ పై సినిమా చేస్తానని... దీనికి తన వద్ద కొన్ని సినిమాల పేర్లు ఉన్నాయని ఆయన చెప్పారు. మరోవైపు పవన్ పై అంబటి చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు మండిపడుతున్నారు. ఇంకోవైపు తిరుపతిలో జనసేన నేతలు వినూత్న నిరసనకు దిగారు. అంబటి రాంబాబుపై 'SSS' పేరుతో  సినిమా ముహూర్తపు షాట్ ను చిత్రీకరించారు. ఒక వ్యక్తికి అంబటి రాంబాబు మాస్క్ వేసి ఈ సీన్ ను తీశారు.

ఈ సందర్భంగా మీడియాతో జనసేన నేతలు మాట్లాడుతూ...  'SSS' అంటే సందులో సంబరాల శాంబాబు అని అర్థమని చెప్పారు. ఈ సినిమాలో హీరోయిన్స్ ని ముంబై రెడ్ లైట్ ఏరియా నుంచి కానీ కోల్ కతా చాందినీ గంజ్ నుంచి కానీ తీసుకొస్తామని తెలిపారు. జగ్గూభాయ్ సమర్పణలో చిత్రాన్ని నిర్మిస్తామని చెప్పారు. నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడకుండా తమ అధినేత పవన్ గురించి మాట్లాడితే... రాబోయే రోజుల్లో 'XXX రాంబాబు' అనే సినిమా కూడా తీస్తామని హెచ్చరించారు.

SSS
Sandhulo Sambarala Shyambabu
Janasena
Ambati Rambabu
YSRCP

More Telugu News