Nara Lokesh: పాదయాత్రలో నారా లోకేశ్ చేతికి గాయం

Nara Lokesh injured in Vinukonda constituency

  • పల్నాడు జిల్లాలో లోకేశ్ యువగళం 
  • వినుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర
  • లోకేశ్ తో కరచాలనం కోసం ఎగబడిన జనం
  • చేతి వేలికి గాయం కావడంతో కట్టు కట్టుకుని పాదయాత్ర కొనసాగించిన లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేశ్ చేతికి గాయమైంది. లోకేశ్ తో కరచాలనం చేసేందుకు జనాలు ఒక్కసారిగా ఎగబడడంతో ఆయన చేతి వేలికి గాయమైనట్టు తెలుస్తోంది. రక్తం వస్తుండడంతో లోకేశ్ ఓ చిన్న గుడ్డ ముక్కను వేలికి కట్టుకుని పాదయాత్ర కొనసాగించారు. 

దీనిపై తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ లో స్పందించింది. ఇదే గాయం జగన్ రెడ్డికి తగిలుంటే భారీ ఎత్తున డ్రామాలు జరిగుండేవని ఎద్దేవా చేసింది. ఆసుపత్రిలో చేరి చావుబతుకుల మధ్య ఉన్నట్టు బిల్డప్ లు, వీర లెవల్లో నటనలు ఉండేవని వ్యంగ్యం ప్రదర్శించింది. లోకేశ్ అసలేం జరగనట్టే పాదయాత్రను కొనసాగించారని టీడీపీ తన ట్వీట్ లో కొనియాడింది.

Nara Lokesh
Injury
Hand
Yuva Galam Padayatra
  • Loading...

More Telugu News