Hardhik Pandya: లగ్జరీలు కావాలని మేము అడగలేదు: వెస్టిండీస్ బోర్డ్ పై హార్ధిక్ పాండ్యా విమర్శలు

Hardhik Pandya criticises West Indies cricket board

  • తమకు వసతులు కల్పించడంలో విండీస్ బోర్డు విఫలమయిందన్న పాండ్యా
  • ప్రయాణాల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని సూచన
  • తదుపరి టూర్ లో అయినా కనీస వసతులు కల్పించాలని విన్నపం

వెస్టిండీస్ తో జరిగిన 3 వన్డేల సిరీస్ ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. చివరి వన్డేలో భారత్ 5 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరు సాధించింది. శుభ్ మన్ గిల్ 85 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. హార్ధిక్ పాండ్యా 52 బంతుల్లో 70 పరుగులు చేశాడు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ కేవలం 151 పరుగులకే ఆలౌట్ అయింది. రెండు జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ ప్రారంభం కాబోతోంది. 

మరోవైపు వెస్టిండీస్ బోర్డుపై హర్ధిక్ పాండ్యా విమర్శలు గుప్పించాడు. తమకు కనీస వసతులు కల్పించడంలో విండీస్ మేనేజ్ మెంట్ విఫలమయిందని విమర్శించాడు. తమకు లగ్జరీలు కావాలని తాము కోరడం లేదని... తదుపరి జరిగే టూర్ లో అయినా తమకు కనీస వసతులను కల్పించాలని కోరాడు. ముఖ్యంగా ప్రయాణాల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని చెప్పాడు.

  • Loading...

More Telugu News