India: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

West Indies opt to bowl against India

  • మూడో వన్డేలోను కోహ్లీ, రోహిత్ లేకుండానే..
  • తుది జట్టులో ఉమ్రాన్ మాలిక్ స్థానంలో రుతురాజ్
  • అక్షర్ పటేల్ స్థానంలో ఉనద్కత్

కీలకమైన మూడో వన్డేలో వెస్టిండీస్ టాస్ గెలిచి భారత్‌కు బ్యాటింగ్‌ను అప్పగించింది. టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్‌ను ఎంచుకొంది. మూడో వన్డేలోను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడటం లేదు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టీమిండియా బరిలోకి దిగుతోంది. తుది జట్టులో ఉమ్రాన్ మాలిక్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, అక్షర్ పటేల్ స్థానంలో జయదేవ్ ఉనద్కత్ ఆడుతున్నారు.

భారత తుది జట్టు ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్, సంజు శాంసన్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జడేజా, శార్దూల్ ఠాకూర్, జయ్ దేవ్, కుల్దీప్, ముకేశ్ కుమార్ ఉన్నారు.
విండీస్ తుది జట్టులో బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అథనేజ్, షై హోప్, షిమ్రోన్ హిట్‌మెయర్, కిసీ కార్టీ, రోమెరియో షెపర్డ్, యానిక్ కరియా, అల్జారీ జోసెఫ్, గుడకేశ్ మోతీ, సీల్స్ ఉన్నారు.

India
Team India
Cricket
west indies
  • Loading...

More Telugu News