Nagashourya: ఈ నెల 4వ తేదీన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తున్న రెండు తెలుగు సినిమాలివే!

- జులై 7న వచ్చిన 'రంగబలి'
- కామెడీ హైలైట్ గా నిలిచిన సినిమా
- నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ నెల 4న స్ట్రీమింగ్
- జూన్ 2వ తేదీన థియేటర్లకు వచ్చిన 'పరేషాన్'
- సోనీ లివ్ ద్వారా ఈ నెల 4న స్ట్రీమింగ్
నాగశౌర్య హీరోగా 'రంగబలి' సినిమా రూపొందింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి, పవన్ బాసం శెట్టి దర్శకత్వం వహించాడు. నాగశౌర్య - యుక్తి తరేజా జంటగా నటించిన ఈ సినిమా, జులై 7వ తేదీన థియేటర్లకు వచ్చింది. పవన్ సీహెచ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, కంటెంట్ పరంగా తీసిపారేయదగినదేం కాదు.

