Shobu Yarlagadda: యంగ్ హీరో తీరుపై నిర్మాత శోభు యార్లగడ్డ ఆగ్రహం

Shobhu Yarlagadda warning to Tollywood young hero
  • ఓ యంగ్ హీరో తన ఆటిట్యూడ్ తో మంచి హిట్ సినిమాను వదులుకున్నాడన్న శోభు
  • స్క్రిప్ట్ చెప్పడానికి వెళ్లిన కొత్త డైరెక్టర్ కు గౌరవం కూడా ఇవ్వలేదని విమర్శ
  • ఇలాంటి ఆటిట్యూడ్ అతని కెరీర్ కు మేలు చేయదని వ్యాఖ్య
తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నిర్మాత శోభు యార్లగడ్డ. సినిమా రూ. 100 కోట్లు వసూలు చేస్తే చాలా ఎక్కువనుకునే రోజుల్లో... అంతకు మించిన బడ్జెట్ తో 'బాహుబలి' చిత్రాలను ఆయన నిర్మించారు. అప్పటి నుంచే మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కడం మొదలయ్యాయి. ఏనాడూ విమర్శల జోలికి వెళ్లని శోభు... తొలి సారిగా ఒక యంగ్ హీరోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇటీవలే సక్సెస్ లో ఉన్న ఓ యంగ్ హీరో తన ఆటిట్యూడ్ వల్ల ఒక మంచి హిట్ సినిమాను వదులుకున్నాడని శోభు చెప్పారు. ఒక కొత్త డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్పడానికి ఆతని వద్దకు వెళ్లినప్పుడు... ఆ డైరెక్టర్ కు కనీస గౌరవం కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్న వారికి మినిమం గౌరవం అయినా ఇవ్వాలని అన్నారు. త్వరగానే అతను ఈ ఆటిట్యూడ్ నుంచి బయటపడతాడని భావిస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి ఆటిట్యూడ్ అతని కెరీర్ కు ఏమాత్రం మేలు చేయదని అన్నారు. అయితే ఆ యంగ్ హీరో విష్వక్సేన్ మాత్రం కాదని చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. అయితే ఆ హీరో ఎవరో శోభు చెప్పకపోవడంతో... ఎవరు ఆ యంగ్ హీరో అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.
Shobu Yarlagadda
Tollywood
Young Hero

More Telugu News