Ambati Rambabu: పవన్ అంగట్లో సరుకులాంటివాడు... ఎవరైనా కొనుక్కోవచ్చు: అంబటి రాంబాబు

Ambati Rambabu satires on Pawan Kalyan

  • రాజకీయ విమర్శలు చేసిన అంబటి రాంబాబు
  • ప్యాకేజి స్టార్ అంటూ పవన్ పై వ్యాఖ్యలు
  • లోకేశ్ టీడీపీకి పట్టిన శని అంటూ విమర్శలు
  • సత్తెనపల్లిలో తన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ధీమా

ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు జనసేనానిపై రాజకీయ విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ కల్యాణ్ అంగట్లో సరుకులాంటివాడని, ఆ ప్యాకేజి స్టార్ ను ఎవరైనా కొనుక్కోవచ్చని ఎద్దేవా చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో తన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. 

బీసీలకు పెద్దపీట వేస్తున్న సీఎం జగన్... తాను మంచి చేస్తేనే ఓటు వేయాలంటున్నారని, అలాంటి వ్యక్తి జగన్ తప్ప మరొకరు  లేరని స్పష్టం చేశారు. ఇక, నారా లోకేశ్ తెలుగుదేశం పార్టీకి పట్టిన శని, టీడీపీ వాళ్లు ఈ విషయం గుర్తిస్తే మంచిదని పేర్కొన్నారు.

Ambati Rambabu
Pawan Kalyan
YSRCP
Janasena
  • Loading...

More Telugu News