Shobana: శోభన ఇంట్లో పనిమనిషి దొంగతనం.. ఆమెనే తిరిగి పనిలో పెట్టుకున్న సినీ నటి!

House maid steals money in actress Shobana house
  • చెన్నైలోని తేనాంపేటలో తల్లితో కలిసి నివసిస్తున్న శోభన
  • ఏడాది క్రితం విజయ అనే మహిళను పని మనిషిగా పెట్టుకున్న నటి
  • గత మార్చి నుంచి జూన్ వరకు రూ. 41 వేలు కొట్టేసిన పనిమనిషి
ప్రముఖ సినీ నటి శోభనకు నటిగానే కాకుండా, క్లాసికల్ డ్యాన్సర్ గా కూడా మంచి గుర్తింపు ఉంది. వివిధ భాషల సినిమాల్లో నటించిన శోభన తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు. తాజాగా ఆమె ఇంట్లో చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని తేనాంపేట శ్రీనివాస రోడ్డులో తన తల్లితో కలిసి ఆమె నివసిస్తున్నారు. కడలూర్ జిల్లా కోవిల్ కు చెందిన విజయ అనే మహిళను ఏడాది క్రితం ఇంట్లో పనిమనిషిగా పెట్టుకున్నారు. 

విజయ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అప్పుడప్పుడు డబ్బులు మాయం అవుతుండటం జరుగుతూ వచ్చింది. దీంతో శోభనకు అనుమానం వచ్చి తేనాంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శోభన ఫిర్యాదుతో విజయను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపారు. పోలీసు విచారణలో డబ్బును తానే కొట్టేశానని విజయ ఒప్పుకుంది. గత మార్చి నుంచి జూన్ వరకు రూ. 41 వేలు చోరీ చేశానని పోలీసులకు తెలిపింది. పేదరికం కారణంగానే తాను ఈ తప్పు చేశానని, తనను మన్నించాలని శోభనను విజయ ప్రాధేయపడింది. ఆమె దీన స్థితికి కరిగిపోయిన శోభన... పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుని, మళ్లీ తన ఇంట్లోనే పని చేయడానికి అనుమతించారు.
Shobana
Tollywood
Kollywood
Robbery

More Telugu News