Andhra Pradesh: బంగాళాఖాతంలో రుతుపవన కరెంట్.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు

Monsoon Current In Bay Of Bengal

  • వచ్చే 24 గంటల్లో ఏపీలో చెదురుమదురు వర్షాలు
  • ఉపరితల ఆవర్తనంగా మారిన అల్పపీడనం
  • తగ్గుముఖం పట్టిన వానలు

బంగాళాఖాతంలో రుతుపవన ప్రవాహం బలంగా ఉండడంతోపాటు కోస్తా తీరం వెంబడి గాలులు బలంగా వీస్తున్నాయని, కాబట్టి మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని ఏపీ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర ఒడిశా పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం నిన్న పూర్తిగా బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారింది.

రుతుపవన ద్రోణి బంగాళాఖాతం వరకు విస్తరించింది. దీంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. నిన్న రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

  • Loading...

More Telugu News