rain: తెలంగాణలో నేడు, రేపు అసాధారణ వర్షం... ఈ రోజు రాత్రి హైదరాబాద్‌కు హైఅలర్ట్

High Alert in Hyderabad from IMD

  • తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు
  • ఇవాళ రాత్రి గంటకు 5 సెం.మీ. వర్షం కురిసే ఛాన్స్

తెలంగాణలో నేడు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని, పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురువవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది. అదిలాబాద్, కుమరం భీమ్, అసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలియజేసింది. 

అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవవచ్చునని, కొన్నిచోట్ల గంటకు 50 కిలో మీటర్ల వేగంతోను గాలులు వీస్తాయని తెలిపింది. శుక్రవారం కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. గురు, శుక్రవారాలు అలర్ట్ గా ఉండాలని హెచ్చరించింది. ఈ రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్ నగరం గత కొన్ని రోజులుగా తడిసి ముద్ద అవుతోంది. ఈ రోజు రాత్రి గంటకు 5 సెంటీ మీటర్ల నుండి ఆరు సెంటీ మీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచనలు చేశారు.
 

  • Loading...

More Telugu News