ఎన్నో కష్టాల తరువాత నేను తెలుసుకున్న నిజం ఇదే: 'బ్రో' డైరెక్టర్ సముద్రఖని
- తన కష్టాలను గురించి ప్రస్తావించిన సముద్రఖని
- అనుభవం తనకి నేర్పిన సత్యం ఇదేనని వెల్లడి
- అదే 'బ్రో' సినిమా ద్వారా చెప్పానని వ్యాఖ్య
- ప్రతిఒక్కరికీ కనెక్ట్ అవుతుందని వివరణ
"చెన్నైకి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఊరు మాది. మా ఇంటి దగ్గరి వరకూ నా కారు కూడా వెళ్లదు .. కొంత దూరంలోనే దిగేసి నడుస్తూ వెళ్లాలి. అలాంటి స్థితి నుంచి ఈ రోజున ఈ స్థాయికి రావడానికి కారణం కాలం .. అదే ఎవరినైనా నడిపించేది. నిన్న అనేది జరిగిపోయింది .. రేపు అనేది ఒక ఆశ మాత్రమే .. ఉన్నది ఈ రోజే .. హ్యాపీగా గడిపేయడమే మంచిది అనేది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను" అన్నారు.
"డబ్బున్న వాళ్లలో కూడా చాలామంది ప్రశాంతంగా ఉండకపోవడం నేను గమనించాను. ఓ పదేళ్లకు ముందే ప్లాన్ చేసి పెట్టేస్తారు. ఏదో అనుకుంటే .. ఇంకేదో జరుగుతుంది. జీవితం చాలా చిన్నది .. అతిగా ఆలోచించకు .. హాయిగా గడిపేయ్ అనేదే 'బ్రో' సినిమా ద్వారా నేను చెప్పింది. ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది" అంటూ చెప్పుకొచ్చారు సముద్రఖని.