Rice Exporters: బియ్యం ఎగుమతుల్లో ప్రపంచంలో నెం.1గా భారత్

- 2022లో 22.5 మిలియన్ టన్నుల ఎగుమతి
- తరువాతి స్థానాల్లో వరుసగా థాయ్‌ల్యాండ్, వియత్నాం, పాకిస్థాన్, అమెరికా
- భారత్ నుంచి భాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని అధికంగా దిగుమతి చేస్తున్న ఆఫ్రికా దేశాలు
- మధ్యప్రాచ్యం, మధ్యఆసియా దేశాలకు భారత్ బాస్మతీ బియ్యం ఎగుమతి
- దేశీధరలకు కళ్లెం వేసేందుకు భారత్ నాన్ బాస్మతీ బియ్యం ఎగుమతులపై నిషేధం
- భారత్ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన, ఆహార ద్రవ్యోల్బణం పెరగొచ్చన్న అంచనా
నాన్ బాస్మతీ బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా కలకలానికి దారి తీసింది. అంతర్జాతీయంగా ఆహార ధరలు పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిషేధం గురించి తెలిసిన వెంటనే విదేశాల్లో అనేక మంది బియ్యం బస్తాలను భారీ స్థాయిలో కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కలకలం రేపుతున్నాయి.

బంగ్లాదేశ్, నేపాల్‌తో పాటూ ఆఫ్రికా దేశాలు భారత్ నుంచి అత్యధికంగా బాస్మతీయేతర బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్నాయి. మరోవైపు, మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా దేశాలు మాత్రం భారత్ నుంచి బాస్మతీ బియ్యాన్ని అధికమొత్తంలో దిగుమతి చేసుకున్నాయి.
దేశంలో నైరుతి తీరుతెన్నులతో ఆధారణ పరిస్థితులు నెలకొన్నాయని భారత్ పేర్కొంది. నైరుతి రాకలో ఆలస్యం కారణంగా దిగుబడులు తగ్గవచ్చన్న అంచనాలతో తొలుత ధరలకు రెక్కలొచ్చాయి. ఆ తరువాత కురుస్తున్న భారీ వర్షాలతో అనేక రాష్ట్రాల్లో వరి పంటకు నష్టం వాటిల్లుతోంది.