Rashmika Mandanna: ‘డియర్ కామ్రేడ్’ నాకెంతో స్పెషల్: రష్మిక

Rashmika talks about dear comrade says it will always have a special place in my heart

  • ‘డియర్ కామ్రేడ్’ విడుదలై నాలుగేళ్లు పూర్తి
  • ఈ సినిమాకు తన హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందన్న రష్మిక
  • నటుడు విజయ్, దర్శకుడు భరత్‌కు ధన్యవాదాలు చెబుతూ పోస్ట్

నటి రష్మిక తాజాగా తన ‘డియర్ కామ్రెడ్’ సినిమాను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఆ సినిమా విడుదలై నాలుగేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆమె, మూవీ దర్శకుడు భరత్, నటుడు విజయ్‌తో కలిసి అప్పట్లో దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘‘నా హృదయంలో ఈ సినిమాకు ఎప్పటికీ ప్రత్యేకస్థానం ఉంటుంది. ‘డియర్ కామ్రేడ్‌’కు నాలుగేళ్లు. థ్యాంక్యూ విజయ్, భరత్’’ అని ఆమె కామెంట్ చేశారు. ఈ పోస్ట్ చూసి విజయ్, రష్మిక అభిమానులు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. 

2019లో విడుదలైన ‘డియర్ కామ్రేడ్‌’కు మిశ్రమ స్పందనే వచ్చినప్పటికీ విజయ్ దేవరకొండ, రష్మికల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘గీత గోవిందం’ తరువాత విజయ్, రష్మిక హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

More Telugu News