BC Students: బీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
- ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు సాధించిన బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్
- ఈ విద్యా సంవత్సరం నుంచే పథకం అమలు
- శుక్రవారం ఖరారు కానున్న విధివిధానాలు
బీసీ సామాజికవర్గానికి చెందిన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదివే బీసీ విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజును చెల్లిస్తుందని తెలిపింది. రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లను సాధించిన బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్ మెంట్ చేయనుంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. 2023-24 విద్యా సంవత్సరం నుంచే రీయింబర్స్ మెంట్ ను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం నాడు దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారవుతాయని గంగుల తెలిపారు. ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సీట్లు సాధించిన బీసీ విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు.