Kanna Lakshminarayana: కన్నా లక్ష్మీనారాయణకు గన్ మెన్ల తొలగింపు

AP Govt removes gunmen for Kanna Lakshminarayana
  • మూడు రోజులుగా విధులకు హాజరుకాని కన్నా గన్ మెన్లు
  • ఆరా తీస్తే భద్రతను ఉపసంహరించినట్టు తేలిన వైనం
  • అంబటి ఒత్తిడితోనే గన్ మెన్లను తొలగించారంటూ టీడీపీ మండిపాటు
టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు గన్ మెన్లను ఏపీ ప్రభుత్వం తొలగించింది. గత మూడు రోజులుగా కన్నా గన్ మెన్లు విధులకు రావడం లేదు. దీనిపై ఆరా తీస్తే కన్నాకు భద్రతను ఉపసంహరించినట్టు తేలింది. మరోవైపు కన్నాకు గన్ మెన్లను తొలగించడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. సమాచారం కూడా ఇవ్వకుండానే తొలగించారని విమర్శించారు. మంత్రి అంబటి రాంబాబు ఒత్తిడితోనే గన్ మెన్లను తొలగించారని దుయ్యబట్టారు. కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జీగా చంద్రబాబు నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కన్నా, అంబటిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
Kanna Lakshminarayana
Telugudesam
Gunmen

More Telugu News