Chiranjeevi: 'మై డియర్ బ్రదర్ తారక్' అంటూ కేటీఆర్ కు చిరంజీవి శుభాకాంక్షలు

Chiranjeevi birthday greetings to KTR

  • ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్న కేటీఆర్
  • మీరు ఒక డైనమిక్ లీడర్ అంటూ చిరంజీవి ప్రశంస
  • స్ఫూర్తినిచ్చే మీ కలలు నిజమవ్వాలని ట్వీట్

తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిరంజీవి కూడా కేటీఆర్ కు ట్విట్టర్ వేదికగా బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపారు. 

'మై డియర్ బ్రదర్ తారక్... మీరు ఒక డైనమిక్ లీడర్. మేమంతా ఎంతో ప్రేమించే, ఆరాధించే స్నేహితుడు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. స్ఫూర్తినిచ్చే మీ కలలు నిజమవ్వాలి. మీ ప్రయాణంలో మీరు వేసే ప్రతి అడుగుకు ఆశీర్వాదాలు ఉంటాయి. హ్యాపీ బర్త్ డే' అని చిరంజీవి ట్వీట్ చేశారు. 

Chiranjeevi
Tollywood
KTR
BRS
Birthday

More Telugu News