viveka murder case: సీబీఐకి సునీతా రెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో వాస్తవం లేదు: వివేకా పీఏ కృష్ణారెడ్డి
- సీబీఐకి సునీతా రెడ్డి భర్త ఇచ్చిన వాంగ్మూలంలో వాస్తవం లేదన్న కృష్ణారెడ్డి
- తప్పుడు మాటలు మాట్లాడటం సరికాదని వ్యాఖ్య
- రాజశేఖర్‌రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్న వివేకా పీఏ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐకి సునీతా రెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంపై వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో వాస్తవం లేదని, తప్పుడు మాటలు మాట్లాడటం సరికాదని చెప్పారు.
2019 మార్చి 13న గూగుల్ టేకౌట్ ప్రకారం తనతో శివశంకర్ రెడ్డి ఉన్నారంటూ రాజశేఖర్‌రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ‘‘ఆ రోజు వైఎస్ వివేకా ఇంటి వాస్తు చూపించేందుకు సూర్యనారాయణ అనే వాస్తు నిపుణుడిని తీసుకువచ్చాను. ఆయన ఇంటిని పరిశీలించి చిన్న మార్పులు చేయాలని చెప్పారు. అదే సమయంలో శివశంకర్ రెడ్డి కూడా ఇంట్లో ఉన్నారని, అప్పుడు నేను ఫోన్ చేశానని రాజశేఖర్ రెడ్డి సీబీఐకి వాంగ్మూలంలో చెప్పడం సరికాదు” అని వివరించారు.
‘‘అసలు ఆరోజు శివశంకర్ రెడ్డి మాతో లేరు. నేను ఆయన్ను కలవలేదు. నాడు వివేకా ఇంట్లో ఉన్నది నేను, వాస్తు నిపుణుడు సూర్యనారాయణ మాత్రమే. ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డికి కాదు కదా ఎవరికీ ఫోన్ చేయలేదు. మరొకరు లేరు, ఎవరికీ ఫోన్ చేయలేదు. కావాలంటే వాస్తు నిపుణుడు సూర్యనారాయణను కూడా విచారించుకోవచ్చు” అని కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.