Saitej: మెగా మావయ్యతో చేసే ఛాన్స్ కోసం వెయిటింగ్: సాయితేజ్

Saitej Interview

  • 'విరూపాక్ష'తో హిట్ కొట్టిన సాయితేజ్ 
  • ఈ నెల 28న విడుదల కానున్న 'బ్రో'
  • పవన్ తో కలిసి నటించడం అదృష్టమని వెల్లడి 
  • త్రివిక్రమ్ - సముద్రఖని చాలా కష్టపడ్డారని వ్యాఖ్య

సాయితేజ్ ఇటీవల వచ్చిన 'విరూపాక్ష' సినిమాతో భారీ హిట్ కొట్టాడు. తన కెరియర్లో 100 కోట్ల సినిమాను నిలబెట్టాడు. 'బ్రో' సినిమాలో ఆయన పవన్ కల్యాణ్ తో కలిసి నటించాడు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 28వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో సాయితేజ్ బిజీగా ఉన్నాడు. 

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "చిన్న మావయ్య పవన్ కల్యాణ్ నాకు గురువుతో సమానం. నన్ను యాక్టింగ్ దిశగా నడిపించిందే ఆయన. అలాంటి ఆయనతో కలిసి నటిస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటి ఒక అవకాశం రావడం దేవుడి దయగానే భావిస్తాను. ఆయనతో కలిసి నటించేటప్పుడు నేను పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను" అని అన్నాడు.

ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించారు. ప్రతి పాత్రపై .. ప్రతి సీన్ పై ఆయనకి గల క్లారిటీ చూసి నేను షాక్ అయ్యాను. ఇక ఈ సినిమా స్క్రీన్ ప్లే - డైలాగ్స్ త్రివిక్రమ్ గారు చూసుకున్నారు. చిన్నమావయ్య క్రేజ్ కి తగినట్టుగా ఈ సినిమా రావడానికి ఆయన చాలా కష్టపడ్డారు. చిన్నమయ్యతో కలిసి నటించిన ఈ అనుభూతిని కొంతకాలం ఎంజాయ్ చేస్తాను. ఆ తరువాత పెద్ద మావయ్యతో కలిసి నటించే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తాను" అని చెప్పుకొచ్చాడు. 

Saitej
Pavan kalyan
Samudrakhani
Trivikram Srinivas
BRO Movie
  • Loading...

More Telugu News