Congress: కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా 29 మంది

Telangana Congress Election committee

  • 2023 రాష్ట్ర ఎన్నికల కమిటీలో చైర్మన్ గా రేవంత్ 
  • కమిటీలో 26 మంది, ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ముగ్గురు
  • మల్లు భట్టి, కోమటిరెడ్డి, సీతక్క సహా పలువురికి కమిటీలో చోటు

రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇందుకోసం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీని ఏఐసీసీ గురువారం ప్రకటించింది. ఈ కమిటీలో రేవంత్, మల్లు భట్టి విక్రమార్క సహా 26 మంది ఉన్నారు. మరో ముగ్గుర్ని ఎక్స్-అఫీషియో సభ్యులుగా అధిష్ఠానం నియమించింది. అంటే మొత్తం 29 మందికి కమిటీలో చోటు కల్పించింది. 2023 రాష్ట్ర ఎన్నికల కమిటీలో రేవంత్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

రేవంత్ తో పాటు కమిటీ సభ్యులుగా మల్లు భట్టి విక్రమార్క్, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, పోదెం వీరయ్య, సీతక్క, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ గౌడ్, రేణుకా చౌదరి, గీతారెడ్డి, అజహరుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, బలరాం నాయక్, షబ్బీర్ అలీ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, బొమ్మ ముఖేష్ గౌడ్, సునీతారావు ముదిరాజ్ సభ్యులుగా ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు ఉన్నారు. 

  • Loading...

More Telugu News