Vishwa Prasad: 'బ్రో' విషయంలో అది పుకారు మాత్రమే: నిర్మాత విశ్వప్రసాద్

Vishwa Prasad Interview

  • నిర్మాతగా బిజీగా ఉన్న విశ్వప్రసాద్
  • ఆయన నిర్మాణంలో వస్తున్న 'బ్రో'
  • పవన్ తో అలా స్నేహం ఏర్పడిందన్న విశ్వప్రసాద్ 
  • 'బ్రో' ప్రాజెక్టు సెట్ కావడానికి నాదెండ్ల మనోహర్ కారణం కాదని వెల్లడి

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా .. సాయితేజ్ ముఖ్య పాత్రధారిగా 'బ్రో' సినిమా రూపొందింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమాను విశ్వప్రసాద్ నిర్మించారు. ప్రియా ప్రకాశ్ వారియర్ .. కేతిక శర్మ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నారు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్వప్రసాద్ మాట్లాడారు. ఒక ఫ్యాక్టరీ మాదిరిగా వరుస ప్రొడక్ట్స్ ను అందించాలనే ఉద్దేశంతోనే రంగంలోకి దిగడం జరిగింది. అనుకున్నట్టుగానే వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాము. ఇంతవరకూ 25 సినిమాలు నిర్మించాము. ప్రస్తుతం 5 సినిమాలు రిలీజ్ దిశగా వెళుతున్నాయి. 15 సినిమాల ప్రొడక్షన్ నడుస్తోంది. 15 .. 20 సినిమాలు ప్లానింగులో ఉన్నాయి" అని అన్నారు. 

"నాకు .. నాదెండ్ల మనోహర్ గారికీ మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన ద్వారానే నాకు పవన్ కల్యాణ్ గారు పరిచయమయ్యారు. అయితే 'బ్రో' ప్రాజెక్టు సెట్ కావడానికి నాదెండ్ల మనోహర్ గారు కారణం కాదు. మిగతా ప్రాజెక్టులను పక్కన పెట్టేసి పవన్ కల్యాణ్ గారు ముందుగా నా సినిమాను పూర్తిచేయడం వెనుక, మనోహర్ గారి ప్రమేయం లేదు. ఆయనకి అసలు ఎలాంటి సంబంధం లేదు .. ఇది కేవలం పుకారు మాత్రమే" అంటూ చెప్పుకొచ్చారు. 

Vishwa Prasad
Pavan kalyan
Saitej
Kethika Sharma
BRO Movie
  • Loading...

More Telugu News